News March 28, 2024

BREAKING: సీఎంకు కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎంగా కొనసాగడంలో భారీ ఊరట లభించిన కాసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కోర్టు ఆయనకు మరో 4 రోజుల ఈడీ కస్టడీని పొడిగించింది. దీంతో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 1 వరకు కస్టడీలో ఉండనున్నారు.

Similar News

News February 10, 2026

బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.

News February 10, 2026

ఉపవాసం ఎందుకు ఉండాలి?

image

ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు. మనస్సును దైవచింతనలో నిలపడం. సంకల్పించిన దేవతకు రోజును అంకితం చేయడం. ధ్యానం, పూజలు, మహిమల పఠనంలో గడపాలి. సహనంగా ఉండాలి. జంతువుల పట్ల దయ చూపాలి. శరీరం, మనస్సును శుద్ధిగా ఉంచాలి. శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. మాటలు, ఆలోచనలలో క్రూరత్వం, దురాశ వీడాలి. నిస్వార్థ పనులు చేయాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. వీలైతే మౌనంగా ఉండాలి.

News February 10, 2026

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 26 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, డిప్లొమా అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.inలో ఎన్‌రోల్ చేసుకోవాలి. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 17వరకు పోస్ట్ చేయాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ. 10వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.8,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://erec.ircon.co.in/