News February 8, 2025

Breaking: ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అందుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.

Similar News

News February 8, 2025

కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

image

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.

News February 8, 2025

టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,124 ఖాళీలకు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://cisfrectt.cisf.gov.in<<>>

News February 8, 2025

SA20: సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొడుతుందా?

image

సౌతాఫ్రికా లీగ్ 20 తుది అంకానికి చేరింది. కావ్య మారన్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. రషీద్ సారథ్యంలోని కేప్ టౌన్ టైటిల్‌పై కన్నేయగా ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.

error: Content is protected !!