News February 5, 2025

అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు

image

TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.

Similar News

News February 18, 2025

బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

image

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్‌లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

News February 18, 2025

మా వాళ్లు సెమీస్‌కు వెళ్తే గొప్పే: కమ్రాన్ అక్మల్

image

పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు సెమీస్ వరకూ వెళ్తే గ్రేట్ అంటూ ఎద్దేవా చేశారు. ‘మా జట్టులో చాలా లోపాలున్నాయి. సరైన స్పిన్నర్లే లేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ సమస్యలే. సెలక్షనే సరిగ్గా లేదు. నా దృష్టిలో ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరతాయి. మా జట్టు సెమీస్‌కు చేరితే అది గొప్పే’ అని వ్యాఖ్యానించారు.

News February 18, 2025

సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

image

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.

error: Content is protected !!