News June 3, 2024

BREAKING: సోషల్ మీడియాలో బెదిరింపులపై డీజీపీ వార్నింగ్

image

AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం కూడా నిషిద్ధమన్నారు. ‘అలాంటి వ్యక్తులపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి, PD యాక్ట్ ప్రయోగిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News October 10, 2024

కమిన్స్ వల్లే వారిద్దరూ రాణిస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్

image

SRH ఆటగాళ్లు అభిషేక్, నితీశ్ భారత్‌కు రాణించడం వెనుక ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ పాత్ర ఉందని పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నారు. ‘వారిద్దరికీ IPLలో కమిన్స్ ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. NKRను మిడిల్ ఆర్డర్‌లో పంపడం, కీలక ఓవర్లలో బౌలింగ్ ఇవ్వడం, శర్మని ఓపెనర్‌గా కొనసాగించడం వరకు ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు’ అని పేర్కొన్నారు. బంగ్లాతో నిన్నటి మ్యాచ్‌లో నితీశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగారు.

News October 10, 2024

త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ

image

AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.

News October 10, 2024

ఎంత మంచి మనసయ్యా నీది!

image

రతన్ టాటా తన ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారు. తన ఉద్యోగి ఒకరు అనారోగ్యం పాలయ్యాడని తెలుసుకుని 83 ఏళ్ల వయసులో పుణే వెళ్లి పరామర్శించారు. మీడియాకు తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థికసాయం చేశారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రభావితమైన 80 మంది తాజ్ హోటల్ ఉద్యోగులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ టాటా గ్రూప్ నుంచి ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు.