News June 3, 2024
BREAKING: సోషల్ మీడియాలో బెదిరింపులపై డీజీపీ వార్నింగ్
AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం, వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం కూడా నిషిద్ధమన్నారు. ‘అలాంటి వ్యక్తులపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు ఓపెన్ చేసి, PD యాక్ట్ ప్రయోగిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News September 11, 2024
రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు
TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.
News September 11, 2024
తుంగభద్ర ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం!
కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని నిపుణుల కమిటీ పేర్కొంది. దీంతో జలాశయం పునాదులకు ప్రమాదమని అధికారులను అప్రమత్తం చేసింది. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి లీకేజీ కావడంతో డ్యామ్‌కు ప్రమాదం ఉండొచ్చని సూచించింది. ఇటీవలే డ్యామ్ గేట్ ఊడిపోవడంతో సరిచేసిన సంగతి తెలిసిందే.
News September 11, 2024
వాల్మీకి స్కామ్ గురించి మేమన్నదే నిజమైంది: కేటీఆర్
TG: వాల్మీకి కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మేమన్నదే నిజమైంది. ఈ స్కామ్ ద్వారా రూ.187 కోట్లు దారిమళ్లాయి. ఆ సొమ్మును T కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ HYDకు చెందిన బిల్డర్. ఇద్దరు TG కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడు’ అని ట్వీట్ చేశారు.