News November 19, 2024

Breaking: ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు

image

ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.

Similar News

News November 14, 2025

భారత విద్యార్థులకు రష్యా స్కాలర్‌షిప్స్

image

తమ దేశంలో చదువుకునే భారత విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తామని రష్యా ప్రకటించింది. 2026-27లో 300 మందికి అందజేస్తామని తెలిపింది. రష్యాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఏవియేషన్, మేనేజ్‌మెంట్ తదితర డిగ్రీ, PG కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ స్కాలర్‌షిప్స్‌లో ట్యూషన్ ఫీజు కవర్ అవుతుందని, విద్యార్థులు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకోవచ్చని చెప్పింది.

News November 14, 2025

‘రహేజా’కు భూ కేటాయింపుతో APకి ఏం లాభం? SMలో ప్రశ్నలు

image

AP: విశాఖలో రహేజా సంస్థకు 99 పైసలకే 27 ఎకరాల భూ కేటాయింపును నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారీగా ఉద్యోగాలు కల్పించే TCS లాంటి కంపెనీలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆస్తిని కొద్దిమంది బలవంతులకు భోజనంగా వడ్డించినట్లు ప్రభుత్వ నిర్ణయం ఉంది తప్ప, APకి ఏ లాభం కన్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

News November 14, 2025

టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

image

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.