News November 19, 2024

Breaking: ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు

image

ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.

Similar News

News December 5, 2024

సల్మాన్ షూటింగ్ సెట్లోకి ఆగంతకుడు.. బెదిరింపు!

image

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముంబైలో ఆయన షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి ఓ ఆగంతకుడు దూసుకొచ్చాడు. మూవీ బృందం అతడిని అడ్డుకోగా, తాను లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడినని అతడు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని శివాజీ పార్క్ పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 5, 2024

కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది: పరిశోధకులు

image

కొవిడ్ బాధితుల తలలో ఆ వైరస్ కనీసం నాలుగేళ్లు ఉంటుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్’ అనే జర్నల్‌లో ఆ వివరాలను ప్రచురించారు. ‘మెదడులోని పొరల్లో వైరస్ తాలూకు స్పైక్ ప్రొటీన్ ఉండిపోతుంది. దీంతో నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడు పనితీరు వేగంగా మందగిస్తుంది. కొవిడ్ బాధితుల్లో 5 నుంచి 10శాతం రోగుల్లో అస్వస్థత కనిపిస్తుంది’ అని వివరించారు.

News December 5, 2024

‘పుష్ప-2’: పబ్లిక్ టాక్

image

‘పుష్ప-2’ ప్రీమియర్స్ చూసిన అభిమానుల నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ ఎంట్రీ, ఎలివేషన్లు అదిరిపోయాయని పోస్టులు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్ బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు. WAY2NEWS రివ్యూ రేపు ఉదయం.