News July 18, 2024

BREAKING: రైతు రుణమాఫీ ప్రారంభం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి రూ.6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. దీని వల్ల తొలి విడతలో రూ.లక్ష వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర, ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు.

Similar News

News February 7, 2025

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?

News February 7, 2025

మహారాష్ట్రలో 173 GBS కేసులు

image

మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్‌<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News February 6, 2025

పడుకునే ముందు ఈ పనులు చేస్తే..

image

రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.

error: Content is protected !!