News August 17, 2024

BREAKING: పోలవరం కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం

image

AP: ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన దస్త్రాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే వీటిని కాల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి దీనిపై విచారిస్తున్నారు.

Similar News

News September 19, 2024

భారత్‌కు మెడల్స్ సాధించడమే లక్ష్యం: మనూ భాకర్

image

భారత్‌కు మరెన్నో మెడల్స్ సాధించిపెట్టడమే తన ఏకైక లక్ష్యమని ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ తెలిపారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు. ‘షూటింగే నా జీవితం. ఇంకేమీ ఊహించుకోలేను. లైఫ్‌లో వీలైనంత ఎక్కువ కాలం షూటింగ్‌లో ఉంటూ ఇండియాకు మెడల్స్ సాధిస్తా’ అని పేర్కొన్నారు. ఆగ్రహం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు.. కోపాన్ని ఏదైనా మంచిపని మీదకు మళ్లిస్తానని, క్రీడాకారులకు అది కీలకమని ఆమె వివరించారు.

News September 19, 2024

నీ పని ఇదేనా రేవంతు?: TBJP

image

TG: CM రేవంత్‌రెడ్డిపై X వేదికగా రాష్ట్ర BJP విమర్శలు గుప్పించింది. ‘నీ పని ఢిల్లీకి సూట్‌కేసులు మోయడమా?, గాంధీ కుటుంబానికి భజన చేయడమా?, తెలంగాణేతరులకు ఉద్యోగాలివ్వడమా?, సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పెట్టడమా?, బూతులు తిట్టడమా?, నీ సోదరులకు కంపెనీలు పెట్టివ్వడమా?, నీ సొంత కంపెనీలకు ప్రాజెక్టులిప్పించడమా?, పేదల ఇండ్లు కూల్చి ఒవైసీ, తిరుపతిరెడ్డి బంగ్లాలు కాపాడటమా?’ అని ట్వీట్ చేసింది.

News September 19, 2024

రవిచంద్రన్ అశ్విన్‌.. ది ఆల్‌రౌండర్!

image

చెన్నై టెస్టులో సెంచరీతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజమైన ఆల్‌రౌండర్‌ అంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. బౌలర్‌గా 500 వికెట్లు, బ్యాటర్‌గా పలు సెంచరీలు, యూట్యూబర్, క్రికెట్ అనలిస్ట్, చెస్ ఆటగాడు, ట్విటర్‌ ట్రోలర్, నాన్-స్ట్రైకర్ రన్ ఔట్ స్పెషలిస్ట్ అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఈరోజు 102 రన్స్‌ చేసిన ఆయన రేపు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేయాలని విష్ చేస్తున్నారు.