News October 27, 2024
BREAKING: కదులుతున్న రైలులో మంటలు!

మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2026
సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
News February 15, 2026
నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.
News February 15, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


