News September 3, 2024
BREAKING: కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు
TG: విద్యా రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో దీనిని ఏర్పాటు చేసింది. త్వరలో వీరిని నియమించనుంది. ఈ కమిషన్‌కు రెండేళ్లు కాలపరిమితిగా నిర్ణయించింది.
Similar News
News September 15, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగ్గా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శనివారం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లై, ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు.
News September 15, 2024
కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
TG: ఎమ్మెల్యేల పార్టీ మార్పు <<14105126>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందని అన్నారు. గాంధీనే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు. ఎవరెన్ని చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో తగ్గదన్నారు.
News September 15, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొట్టనున్నాం: షమీ
ఆస్ట్రేలియాపై BGT సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టనుందని టీమ్ ఇండియా బౌలర్ షమీ జోస్యం చెప్పారు. ‘ఇండియాయే ఫేవరెట్. అందులో డౌట్ లేదు. ప్రత్యర్థి ఆసీస్ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. కానీ గెలుస్తాం’ అని పేర్కొన్నారు. కమ్ బ్యాక్ విషయంలో తాను కంగారు పడటం లేదని తెలిపారు. ‘పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టాలి. లేదంటే మళ్లీ ఇబ్బంది పడాలి. ఎంత ఫిట్ అయితే అంత మంచిది’ అని వివరించారు.