News August 25, 2024

BREAKING: మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత

image

AP: మాజీ MLA డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిన ఆయన 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లకే టీడీపీలో చేరారు. పార్టీలో గొడవలతో మళ్లీ వైసీపీ గూటికి చేరినా క్రియాశీలకంగా పనిచేయలేదు.

Similar News

News December 1, 2025

అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.

News December 1, 2025

భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

image

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.