News August 25, 2024
BREAKING: మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత
AP: మాజీ MLA డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. 1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిన ఆయన 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండేళ్లకే టీడీపీలో చేరారు. పార్టీలో గొడవలతో మళ్లీ వైసీపీ గూటికి చేరినా క్రియాశీలకంగా పనిచేయలేదు.
Similar News
News September 10, 2024
హైడ్రాకు ప్రత్యేక సిబ్బంది కేటాయింపు
TG: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు కమిషనర్గా రంగనాథ్ ఉన్న సంగతి తెలిసిందే.
News September 10, 2024
ఉచిత బస్సుతో అద్భుత ఫలితాలు.. సీఎంతో అధికారులు
TG: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు స్కీం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అధికారులు సమీక్షలో సీఎంకు చెప్పారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా ప్రయాణికులకు రూ.2,840 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి HYDలోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగిందని వివరించారు.
News September 10, 2024
త్వరలోనే ఆపరేషన్ బుడమేరు.. కబ్జా చేస్తే శిక్ష: CM
గత ఐదేళ్లలో బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలు కట్టారని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. ఒకానొక దశలో అది పూడుకుపోయే దశకు చేరిందని CM చంద్రబాబు తెలిపారు. చెత్తాచెదారం తీయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయని, గట్లను పట్టించుకోకపోవడం వల్ల 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేసి, కబ్జా చేసినట్లు తేలితే శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు.