News January 4, 2025
BREAKING: తగ్గిన బంగారం ధర
గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గి రూ.78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.72,150గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News January 6, 2025
గన్నవరం TDP ఆఫీసు ఘటన.. పిటిషన్లు కొట్టివేత
AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 17 మంది తమను అరెస్ట్ నుంచి కాపాడాలని కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు.
News January 6, 2025
ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే
భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.
News January 6, 2025
ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్
AP: రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు మూతబడటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేయాలని కార్మికులు ఈ నెల 2నుంచి సమ్మె చేస్తుండగా యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసిన కార్మికులు, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిల్లు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.