News January 4, 2025
BREAKING: తగ్గిన బంగారం ధర
గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గి రూ.78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.72,150గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News January 23, 2025
ట్రంప్ తగ్గేదే లే
అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.
News January 23, 2025
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.
News January 23, 2025
కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.