News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News February 4, 2025

కేసీఆర్‌ కుటుంబానికి ప్రధాని సానుభూతి

image

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 4, 2025

ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్

image

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

News February 4, 2025

పార్టీ విప్‌లను నియమించిన KCR

image

TG: శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను నియమిస్తూ KCR నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. తమ పార్టీ అధినేత KCR నిర్ణయాన్ని స్పీకర్‌కు ఆ పార్టీ నేతలు తెలియజేశారు.

error: Content is protected !!