News November 26, 2024
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.
Similar News
News November 26, 2024
ప్రేమ కోసమై వలలో పడెనే..
ఉక్రెయిన్ యువతితో ప్రేమలో పడిన బ్రిటిష్ యువకుడు రష్యాకు చిక్కిన ఘటన ఇది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ స్కాట్(22) అనే వ్యక్తి ఉక్రెయిన్ యువతిని ప్రేమించాడు. ఆమె మీద ప్రేమ ఉక్రెయిన్‌పైకి కూడా మళ్లడంతో ఆ దేశ సైన్యం తరఫున రష్యాపై యుద్ధంలో పాల్గొన్నాడు. ఈక్రమంలో పట్టుబడ్డాడు. తన బిడ్డను రష్యా హింస పెట్టి చంపుతుందేమోనంటూ అతడి తండ్రి స్కాట్ ఆండర్సన్ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.
News November 26, 2024
కొత్త బంతితో బౌల్ట్ మెరుస్తారు: ఆకాశ్ అంబానీ
MI జట్టులో చేరిన బౌల్ట్ కొత్త బంతితో మెరుస్తారని జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. బౌల్ట్‌తో పాటు టోప్లే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు కావడంతో వారిని తీసుకోవాలని ముందే అనుకున్నట్లు చెప్పారు. గతంలో బౌల్ట్ MIకు ఆడినప్పుడు కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అద్భుతంగా రాణించారన్నారు. ఐపీఎల్లో 104 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 121 వికెట్లు తీశారు. వేలంలో ఇతడిని MI రూ.12.50కోట్లకు కొనుగోలు చేసింది.
News November 26, 2024
రాజ్యాంగం లక్ష్యం అదే: సీఎం చంద్రబాబు
AP: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి దీనిని రచించారు. రాజ్యాంగ పరిషత్‌లో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగాన్ని కొందరు తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు’ అని వ్యాఖ్యానించారు.