News November 30, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

ఖాతాదారులకు EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త చెప్పింది. ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసే తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెటిల్‌మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమల్లో ఉంది. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్న ఫిర్యాదులు రావడంతో ఇవాళ్టి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News March 12, 2026

మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి!

image

ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. మార్చి 31లోపు సరైన ఇన్వెస్ట్‌మెంట్లతో పన్ను ఆదా చేసుకోండి. 80C కింద ELSS, PPFలలో ₹1.5 లక్షల వరకు, NPS (80CCD) ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియానికి ₹50 వేలు, 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే 80G కింద విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది.

News March 12, 2026

కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్‌సైట్: <>https://adityauniversity.in/careers<<>>

News March 12, 2026

UPSCపై వివాదం.. ఇంటర్వ్యూలో పక్షపాతం?

image

UPSC సివిల్స్‌లో రిజర్వ్‌డ్ క్యాండిడేట్స్‌కు అన్యాయం జరుగుతోందంటూ SMలో చర్చ జరుగుతోంది. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ వస్తున్నట్లు ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇంటర్వ్యూ బోర్డు పక్షపాతం వల్లే అంటోంది. మెయిన్స్‌లో టాప్ మార్కులు వచ్చిన ఓ రిజర్వ్‌డ్ క్యాండిడేట్‌కు ఇంటర్వ్యూలో 60/275 మార్కులే వచ్చినట్లు ఉదహరిస్తోంది. దీన్ని మరో వర్గం మాత్రం కొట్టిపారేస్తోంది.