News November 30, 2024
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఖాతాదారులకు EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త చెప్పింది. ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసే తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెటిల్‌మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమల్లో ఉంది. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్న ఫిర్యాదులు రావడంతో ఇవాళ్టి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News February 12, 2026
IMA డెహ్రాడూన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA)డెహ్రాడూన్‌లో 10 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianmilitaryacademy.nic.in/
News February 12, 2026
మూల్యాంకనంలో తప్పులు జరగకుండా CBSE కీలక నిర్ణయం

12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం CBSE మళ్లీ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతిని ప్రారంభించాలని నిర్ణయించింది. స్కాన్ చేసిన జవాబు పత్రాలను ఉపాధ్యాయులు కంప్యూటర్లలోనే దిద్ది, మార్కులు వేస్తారు. సాఫ్ట్‌వేర్ ద్వారా మార్కులు ఆటోమేటిక్‌గా లెక్కించడంతో కూడికలో తప్పులు జరగవని బోర్డు భావిస్తోంది. ఫలితాలు చాలా వేగంగా, పారదర్శకంగా విడుదల చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
News February 12, 2026
రహేజాకు భూములపై మండలిలో వాడీవేడి చర్చ

AP: కంపెనీలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, YCP MLC మాధవరావు ప్రశ్నించారు. విశాఖలోని భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. రహేజా బిల్డింగ్స్‌లో అనేక కంపెనీలు వస్తున్నాయని, వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.


