News November 2, 2024
BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
TG: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.
Similar News
News December 11, 2024
APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
APకి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ల సదస్సులో CM చంద్రబాబు వెల్లడించారు. వీటితో 4లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామసభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయన్నారు.
News December 11, 2024
వచ్చే ఏడాదిపై సమంత ఆసక్తికర పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది తనకు ఎలా ఉంటుందో చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. 2025లో చాలా బిజీగా ఉండటమే కాకుండా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారని అందులో ఉంది. ప్రేమను పంచే భాగస్వామిని పొందడంతో పాటు కొందరు పిల్లలు కూడా కలుగుతారని, మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని ఈ లిస్టులో ఉంది. దీంతో సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
News December 11, 2024
ప్రపంచంలో భారత ఫుడ్ టేస్ట్ ర్యాంకు ఎంతంటే…
ప్రపంచంలో అత్యంత రుచికరమైన ఆహారం కలిగిన 100 దేశాల్లో భారత్ 12వ స్థానాన్ని దక్కించుకుంది. టేస్ట్ అట్లాస్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అగ్రస్థానంలో గ్రీస్, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ ఆహారాలున్నాయి. భారత వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీ, అమృతసరీ కుల్చా, బటర్ గార్లిక్ నాన్, బటర్ చికెన్ రుచికరమైనవని టేస్ట్ అట్లాస్ స్పష్టం చేసింది.