News February 23, 2025
BREAKING: గ్రూప్-2 ‘ఇనిషియల్ కీ’ విడుదల

AP: ఇవాళ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ‘ఇనిషియల్ కీ’ని APPSC విడుదల చేసింది. https://portal-psc.ap.gov.inలో కీ చూసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రశ్నలు, కీపై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కీ కోసం ఇక్కడ <
Similar News
News March 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 24, 2025
శుభ ముహూర్తం (24-03-2025)

☛ తిథి: బహుళ దశమి రా.12.34 వరకు తదుపరి ఏకాదశి
☛ నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.31 వరకు తదుపరి శ్రవణం
☛ శుభ సమయం: ఉ.6.15-ఉ.6.51, రా.7.27-రా.7.51
☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
☛ దుర్ముహూర్తం: మ.12.24-మ1.12, మ.2.46-మ.3.34
☛ వర్జ్యం: ఉ.8.15 నుంచి ఉ.9.53 వరకు
☛ అమృత ఘడియలు: సా.6.00 నుంచి రా.7.38 వరకు
News March 24, 2025
మహిళలకు సూపర్ స్కీమ్.. నెలాఖరు వరకే గడువు

భారత మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం MSSC. రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్‌లో 40శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్ లభిస్తుంది. ఈ నెలాఖరుకే పథకం ఆగిపోనుంది. మరిన్ని వివరాలకు సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు. షేర్ చేయండి.