News September 3, 2024
BREAKING: పాకిస్థాన్‌కు ఘోర పరాభవం

పాకిస్థాన్‌కు సొంత గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో రెండో టెస్టులోనూ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్సులో 185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.
స్కోర్లు: పాక్ 274& 179; బంగ్లా 262& 185
Similar News
News January 15, 2026
53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు ప్రయాణం

53 ఏళ్ల తర్వాత మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు చేరనున్నారు. నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ వచ్చే నెల 6న ప్రారంభమై 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి వస్తారు. 1972లో చేపట్టిన అపోలో తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఆర్టెమిస్-3 ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లనున్నారు.
News January 15, 2026
ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో నారావారిపల్లెలో ఉన్న ఆయన క్లస్టర్ యూనిట్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఆదాయం వచ్చేలా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఇంటర్నెట్, క్యాబిన్లు, క్యాంటిన్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు.
News January 15, 2026
ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: మోదీ

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా వైభవంగా జరుపుకొనే ఈ వేడుక అందరి హృదయాల్లో ఆనందాన్ని, కృతజ్ఞతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉండే ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలో సుఖ శాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగులో ట్వీట్ చేశారు.


