News September 3, 2024
BREAKING: పాకిస్థాన్‌కు ఘోర పరాభవం
పాకిస్థాన్‌కు సొంత గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో రెండో టెస్టులోనూ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్సులో 185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.
స్కోర్లు: పాక్ 274& 179; బంగ్లా 262& 185
Similar News
News September 13, 2024
‘మత్తు వదలరా-2’ సినిమా రివ్యూ
మర్డర్ కేసులో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. తన కామెడీ టైమింగ్‌తో సత్య ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ప్లస్ పాయింట్లు. సాగదీత సీన్లు, రొటీన్ అంశాలు మైనస్. డైరెక్టర్ కామెడీపై పెట్టిన ఫోకస్ ఇంకాస్త స్టోరీపై పెట్టుంటే బాగుండేది. కామెడీని ఇష్టపడే వారికి నచ్చుతుంది. రేటింగ్ 2.5/5.
News September 13, 2024
టీమ్‌ఇండియా ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త బౌలింగ్ కోచ్
బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. కొత్త బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ కూడా జట్టులో చేరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈనెల 19-23 వరకు తొలి టెస్ట్, ఈనెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.
News September 13, 2024
జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో స్వల్ప ఊరట
AP: TDP ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో YCP నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది. నిందితులు 24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలంది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంను ఆశ్రయించారు.