News September 1, 2024
భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

TG: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), అంజిలమ్మ(38) మృతిచెందారు. అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వల్లో 52.9cm వర్షం కురిసింది. ఇనుగుర్తి (మహబూబాబాద్)-45.5cm, రెడ్లవాడ (వరంగల్)-45cm, చిన్నగూడూర్ (మహబూబాబాద్)-45cm, ముకుందపురం (సూర్యాపేట)-44cm వర్షపాతం నమోదైంది.
Similar News
News October 29, 2025
ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

TG: ఫీజు రీయింబర్స్మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
News October 29, 2025
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.
News October 29, 2025
బిహార్ అభ్యర్థుల్లో 32% మందిపై క్రిమినల్ కేసులు

బిహార్ ఫేజ్1 ఎన్నికలు జరిగే 121 అసెంబ్లీ స్థానాల్లో 1314 మంది పోటీలో ఉన్నారు. అఫిడవిట్లు ఇచ్చిన 1303 అభ్యర్థుల్లో 423(32%) మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR పేర్కొంది. వీరిపై 33 మర్డర్, 86 అటెంప్ట్ టు మర్డర్, 46 రేప్ వంటి కేసులు నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే RJD 53, CONG 15, BJP 31, JDU 22, LJP 7 మంది క్రిమినల్ కేసులున్న వారే. ఇక లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల్లో 30 మందిపై అలాంటి కేసులే ఉన్నాయి.


