News August 21, 2024
రియాక్టర్ పేలుడు.. 14 మంది మృతి
AP: ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన <<13910036>>ఘటనలో<<>> మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడుతో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొందరి మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు మొత్తం 22 మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Similar News
News September 14, 2024
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది.
News September 14, 2024
మగ పిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి?
డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) వ్యాధి ఎక్కువగా మగపిల్లలకే సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా కండరాల క్షీణత, శ్వాసకోస సమస్యలు, నడవలేకపోవడం వంటివి ఎదుర్కొంటారు. దీనికి చికిత్స అందుబాటులో లేదు. కొంతకాలం జీవించి చనిపోతారు. ఈ వ్యాధి సోకిన వారు యుక్త వయసుదాటి బతకడం కష్టమే. ఇటీవల తెలంగాణకు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు ఈ వ్యాధి సోకింది. ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులకు 99% ఇది సోకుతుంది.
News September 14, 2024
జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
AP: నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై DGP ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ACP కె.హనుమంతరావు, CI ఎం.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు CIలు, ఒక SI పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం. కాగా నిన్న ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.