News July 4, 2024
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,090 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 పెరిగి రూ.97,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Similar News
News March 24, 2026
HYD: IT కారిడార్లో ‘డిజిటల్ కన్ను’!

HYDలోని IT కారిడార్లో సైబరాబాద్ పోలీసులు ప్రయోగాత్మకంగా ‘AI క్రైమ్ ప్రిడిక్షన్’ వ్యవస్థను అమలు చేస్తున్నారు. గత నేరాల డేటాను విశ్లేషించి, రాబోయే 48 గంటల్లో గొడవలు జరిగే ప్రాంతాలను ఇది ముందే పసిగడుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. అయితే, పబ్లిక్ సేఫ్టీ కోసం వాడుతున్న ఈ టెక్నాలజీ వివరాలను హోమ్ శాఖ ప్రస్తుతానికి అధికారికంగా ధ్రువీకరించలేదు.
News March 24, 2026
అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం: CBN

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై నిగ్గు తేల్చాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక వాటి వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తోంది’ అని పేర్కొన్నారు. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 24, 2026
ALERT: పెట్రోల్ కొట్టిస్తున్నారా?

బంకుల్లో ఇంధనం కొట్టిస్తున్నప్పుడు చాలా మంది రీడింగ్ సున్నా ఉందో చెక్ చేస్తుంటారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ డెన్సిటీ 720 – 775kg/m³, డీజిల్ 820 – 860kg/m³ మధ్య ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు అర్థం. ఈ ఇంధనం మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్ను దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా ‘Density’ డిస్ప్లేలో చెక్ చేయండి. share it


