News July 4, 2024
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,090 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 పెరిగి రూ.97,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Similar News
News October 8, 2024
మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున
TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.
News October 8, 2024
అక్రమ కూల్చివేతలకు బ్రేక్!
TG: అక్రమ కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై హైడ్రా దృష్టి పెట్టిందని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో 3 నెలలు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చిందని తెలిపాయి. అదే సమయంలో చెరువుల సర్వే పూర్తి చేసి, తదుపరి కార్యాచరణ రూపొందించాలని సర్కార్ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News October 8, 2024
అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..
దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.