News January 31, 2025

BREAKING: అండర్-19 WC ఫైనల్లో భారత్

image

అండర్-19 W T20 వరల్డ్ కప్‌ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 9 వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ENG 20 ఓవర్లలో 113 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో భారత ఓపెనర్ కమలిని హాఫ్ సెంచరీతో చెలరేగారు. 50 బంతుల్లో 56 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష 35, సానిక 11*తో రాణించారు. దీంతో IND 15 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించి ఎల్లుండి సౌతాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది.

Similar News

News February 16, 2025

ఘజన్‌ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

image

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్‌ఫర్ స్థానంలో ముజీబ్‌ ఉర్ రహ్మాన్‌ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు ఘజన్‌ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.

News February 16, 2025

రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

image

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.

News February 16, 2025

వల్లభనేని వంశీ అంటేనే అరాచకం : మంత్రి నిమ్మల

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్‌లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్‌పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: Content is protected !!