News December 30, 2024

BREAKING: కష్టాల్లో టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇవాళ తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. అయితే 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్(76*) ఉన్నారు. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాలి.

Similar News

News January 26, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మరో ట్విస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ నివాసంలో 19 సెట్ల వేలిముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా, వాటిలో ఒక్కటి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ వేలిముద్రలతో సరిపోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై పోలీసులు మరోమారు ఘటనాస్థలాన్ని, సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 26, 2025

ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్

image

రెడ్ బాల్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 ​​పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.

News January 26, 2025

వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.