News March 2, 2025
BREAKING: భారత్ గెలుపు.. సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరంటే?

CT: చివరి గ్రూప్ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. విలియమ్సన్ 81, శాంట్నర్ 28, యంగ్ 22, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12 రన్స్ చేశారు. వరుణ్ 5 వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ 2, అక్షర్, హార్దిక్, జడేజా తలో వికెట్ తీశారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్‌లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి.
స్కోర్లు: భారత్ 249/9, కివీస్ 205/10
Similar News
News March 3, 2025
పుతిన్ కంటే వారే ప్రమాదం: ట్రంప్

అమెరికాకు పుతిన్ కంటే అక్రమ వలసలని నిరోధించటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. హంతకులు, డ్రగ్స్‌మాఫియా, రేపిస్టులను దేశంలోనికి రాకుండా నిరోధించటం వల్ల తమ దేశం యూరప్‌లా మారకుండా ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు భారీగా తగ్గించామని ‘అమెరికాపై దండయాత్ర ముగిసిందని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో నెలకు 3లక్షలకు పైగా అక్రమ వలసదారులు దేశంలో ప్రవేశించేవారని అన్నారు.
News March 3, 2025
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వచ్చేసింది

నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. ఓదెల శ్రీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2026, మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అసభ్య పదాలు ఉన్న కారణంగా వీడియోను ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు. వీడియో కోసం ఇక్కడ <
News March 3, 2025
ఆదిలాబాద్‌కు అన్యాయమేనా?

TG: పేరులోనే ఆది ఉంది కానీ అభివృద్ధికి మాత్రం ఆదిలాబాద్ దూరంగానే ఉంటోందని ప్రజలు నిరాశ చెందుతున్నారు. వరంగల్ తర్వాత ఆదిలాబాద్‌లోనూ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని వారు కన్న కలలు కల్లలయ్యాయి. ఎక్కడా లేని విధంగా ADBలో స్థలం అందుబాటులో ఉండగా, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ADBతోపాటు కొత్తగూడెం, రామగుండంలోనూ ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.