News April 12, 2024
BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready
Similar News
News February 3, 2026
మా సహనమే గెలిపించింది: మోదీ

తమ సహనానికి ఫలితమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని PM మోదీ అన్నారు. ‘టారిఫ్స్‌ను కొందరు విమర్శించారు. కానీ మేం ఓపికగా ఉన్నాం. ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని NDA పార్లమెంటరీ పార్టీ భేటీలో అన్నారు. ప్రపంచ క్రమం మారుతోందని, ఇండియా వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా ఇండియా ప్రయోజనం పొందుతోందని తెలిపారు. అంతకుముందు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్వీట్ చేశారు.
News February 3, 2026
అలాగైతే ఇండియా నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మా దేశ ప్రైవసీపై మీరు ఆటలు ఆడలేరు. ఇక్కడి డేటాలో ఒక్క అక్షరం/అంకె కూడా షేర్ చేయడానికి మేం అనుమతివ్వం’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.
News February 3, 2026
పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


