News April 12, 2024
BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready
Similar News
News April 17, 2026
WGL: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జరీ పరీక్ష రద్దు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.
News April 17, 2026
LIC HFLలో 180 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. పూర్తి వివరాలకు www.lichousing.com/careers చూడండి.
News April 17, 2026
కేంద్ర మంత్రితో ప్రేమ.. కంగనా రనౌత్ క్లారిటీ!

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘చిరాగ్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పదేళ్ల కిందట మేం కలిసి సినిమా చేశాం. ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండే వారు. ఇన్నేళ్లలో మా బంధంలో ఎలాంటి మార్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. కంగనా, చిరాగ్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించారు.


