News May 10, 2024

BREAKING: కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కాగా.. కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.

Similar News

News March 19, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్!

image

2026-27లో కేంద్రీయ విద్యాలయాల్లో(KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో అడ్మిషన్లకు ఈ నెల 20న 10AM నుంచి ఏప్రిల్ 2 దాకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌<<>>లో సంప్రదించవచ్చు.

News March 19, 2026

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం

News March 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.