News May 10, 2024
BREAKING: కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కాగా.. కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.
Similar News
News February 13, 2025
అమరావతి పనులకు CRDA టైమ్ టేబుల్

AP: అమరావతికి మూడేళ్లలో ఓ రూపు తీసుకొచ్చేందుకు CRDA టైమ్ టేబుల్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగాదికి CRDA మెయిన్ ఆఫీస్ సిద్ధం కానుండగా, రెండున్నరేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.31వేల కోట్లు రుణంగా తీసుకోవాలని CRDA నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్, ADBల నుంచి రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11వేల కోట్లు మంజూరైన విషయం తెలిసిందే.
News February 13, 2025
కాలేజీ విద్యార్థులకు అపార్ ఐడీలు

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని జూన్ నాటికి జారీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ అచీవ్‌మెంట్స్, సర్టిఫికెట్స్, క్రెడిట్స్ డిజిటల్‌గా స్టోర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఆధార్, పేరెంట్స్ అనుమతి తప్పనిసరి.
News February 13, 2025
స్థానిక సంస్థల్లో నోటా.. పార్టీలు ఏమన్నాయంటే?

TG: ఏకగ్రీవం లేకుండా <<15405631>>ఎన్నికల నిర్వహణపై<<>> ఈసీతో భేటీలో ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించొద్దని కాంగ్రెస్, సీపీఎం సూచించాయి. రీ ఎలక్షన్ నిర్వహించాలని BRS, సీపీఐ, జనసేన, ఆప్ పేర్కొన్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే దీనిపై స్పందిస్తామని బీజేపీ తెలిపింది. దీంతో ఎన్నికల నియమావళిలో మార్పుపై త్వరలోనే ఈసీ నిర్ణయం తీసుకోనుంది.