News June 29, 2024

BREAKING: పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు

image

AP: పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్‌డ్రా చేసుకోవాలని కలెక్టర్లను CS నీరభ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉ.6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆరోజే 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని CS సూచించారు.

Similar News

News November 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2024

వేలంలో వాళ్లిద్దర్నీ కొనడం చాలా కష్టం: CSK

image

IPL వేలంలో పంత్, KL రాహుల్‌పై దృష్టి సారిస్తామని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా తెలిపారు. ‘మాకున్న పర్సును బట్టి ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి వారిని కొనడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాం. భారత ప్లేయర్లకు చాలా డిమాండ్ ఉంది’ అని పేర్కొన్నారు. CSKకి ప్రస్తుతం ధోనీ కీపింగ్ చేస్తుండగా, రుతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నారు. పంత్ లేదా రాహుల్‌ను కొంటే ఆ రెండు బాధ్యతల్నీ ఒకరే నిర్వర్తించే అవకాశం ఉంది.

News November 11, 2024

ఆటగాళ్ల వ్యక్తిత్వ హననం తగదు: అశ్విన్

image

జట్టు ఓటమి విషయంలో ఫ్యాన్స్‌కంటే ఆటగాళ్లు రెట్టింపు బాధను అనుభవిస్తారని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఓడిపోయామని తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఆట. గెలుపోటములు సహజం. అభిమానుల కంటే ఎక్కువ బాధ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంది. మైదానంలో ఫలితాలపైనే మా కెరీర్లు ఆధారపడి ఉంటాయి. అలాంటి మా నిబద్ధతను అనుమానించడం చాలా దారుణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.