News June 29, 2024
BREAKING: పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు
AP: పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్‌డ్రా చేసుకోవాలని కలెక్టర్లను CS నీరభ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జులై 1న ఉ.6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆరోజే 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని CS సూచించారు.
Similar News
News October 8, 2024
Stock Markets: నెగటివ్ సిగ్నల్స్.. నేడూ నష్టాలేనా!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజూ నష్టపోయే అవకాశమే ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, హాంగ్‌సెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం US సూచీలూ ఎరుపెక్కాయి. అనిశ్చితి, వెస్ట్ ఏషియా యుద్ధం, క్రూడాయిల్ రేట్లకు తోడు భారత్‌కు FPIల దెబ్బ ఎక్కువగా ఉంది. ఇక్కడి పెట్టుబడులను చైనా మార్కెట్లకు బదిలీ చేస్తున్నారు.
News October 8, 2024
హరియాణా: హ్యాట్రిక్ కొట్టిన చరిత్రే లేదు
హరియాణా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు. గరిష్ఠంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968, 72లో; 2005, 09లో కాంగ్రెస్‌ను గెలిపించారు. 2014, 19లో బీజేపీని అందలమెక్కించారు. దీనికి బ్రేక్ చేసి హ్యాట్రిక్ అందుకోవాలన్న బీజేపీ కల నెరవేరేలా లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే తీర్పునిచ్చాయి. JJP ఓటు బ్యాంకు వారికే బదిలీ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
News October 8, 2024
ఢిల్లీలో ₹65కే కిలో టమాటా
టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా శివారులోని 56 ప్రాంతాల్లో ₹65కే ప్రజలకు అందిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి.