News October 14, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Similar News

News October 14, 2024

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలేదని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్(TPDPMA) తెలిపింది. ఫలితంగా <<14336846>>కళాశాలల<<>> నిర్వహణ భారంగా మారిందని పేర్కొంది. దీంతో బకాయిలు చెల్లించేవరకు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్‌‌కు TPDPMA పిలుపునిచ్చింది.

News October 14, 2024

భారీ వర్షాలు.. CM చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: భారీ వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని CM చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చెరువులు, కాల్వలు, నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చెప్పారు. కాగా NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచామని సీఎంకు అధికారులు తెలిపారు.

News October 14, 2024

ఆర్టీసీ టికెట్ ఛార్జీలు చూసి ప్రయాణికులు షాక్!

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి నగరబాట పట్టిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచి స్పెషల్ సర్వీసులంటూ అమాంతం ధరలు పెంచేసింది. HNK- HYDకి వెళ్తోన్న ఓ ప్రయాణికుడు ధరల పెంపుపై వాపోయాడు. మొన్నటివరకు రాజధాని బస్సులో రూ.370 ఉండగా రూ.160 పెంచి రూ.530 చేశారంటూ మొరపెట్టుకున్నాడు. ఛార్జీలు పెంచడంతో మెదక్(D) నర్సాపూర్‌లో ప్రయాణికులు ధర్నా చేపట్టారు.