News October 21, 2024
BREAKING: బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బలపడి వాయుగుండం, ఆపై తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీలో వర్షాలు పడతాయని, ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Similar News
News November 7, 2024
16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
News November 7, 2024
APPLY NOW.. నెలకు రూ.5000
దేశంలోని టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా నిరుద్యోగుల కోసం కేంద్రం PM ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు ఇస్తారు. కంపెనీలో చేరే ముందు మరో రూ.6వేలు ఇస్తారు. ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. SSC నుంచి డిగ్రీలోపు చదివి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలు దాటకూడదు. ఈ నెల 10 చివరి తేదీ. దరఖాస్తు కోసం ఇక్కడ <
News November 7, 2024
ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.