News March 19, 2024
BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘శంకర’’

‘శం’ అంటే అనంతమైన సుఖం/శాంతి అని అర్థం. ‘కర’ అంటే కలిగించేవాడు. ఎవరైతే తనను నమ్ముకున్న భక్తులకు, ఈ చరాచర జగత్తుకు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తారో ఆయనే శంకరుడు. మానవ జీవితంలో ఎదురయ్యే అశాంతిని దూరం చేసి, మనసును నిర్మలం చేసే దైవం ఆయన. లోక కల్యాణం కోసం నిరంతరం తపించేవాడు కాబట్టే ఆయనను దర్శించుకున్నా, స్మరించుకున్నా మనకు తెలియని ఓ ప్రశాంతత లభిస్తుంది. సర్వ ప్రాణులకు శుభాన్ని కలిగించే మంగళకారి ఆయన.
News February 12, 2026
బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాలపై వైసీపీ చర్చ

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనుంది. మ.3 గంటలకు తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీకి వెళ్లిన జగన్ అన్ని రోజులూ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
News February 12, 2026
నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.


