News May 11, 2024
BREAKING: మే 14న వారికి సెలవు

AP: మే 13న జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి ఈ సెలవు వర్తిస్తుంది. విధులకు హాజరైన రిజర్వ్‌డ్, డ్రాఫ్ట్ చేయబడిన సిబ్బందికి ఈ సెలవు వర్తించదు. కలెక్టర్లు ఈ ఆదేశాలు అమలు చేయాలి’ అని ఆయన ఆదేశించారు.
Similar News
News February 11, 2025
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
News February 11, 2025
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

APలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.