News March 28, 2024
BREAKING: గుండెపోటుతో ఎంపీ మృతి

తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 2019లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.
Similar News
News January 17, 2026
3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.
News January 17, 2026
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.
News January 17, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<


