News November 16, 2024
హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు

హీరో ధనుష్ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార మండిపడ్డారు. ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 20, 2026
ఫోన్ పే, GPayలో లంచాలు.. 8 మంది ఆఫీసర్లపై వేటు!

TG: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై TGSPDCL సీఎండీ ముషారఫ్ చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త కనెక్షన్లు, రెగ్యులర్ సర్వీసులకూ డబ్బు వసూలు చేసిన 8 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఒక ADE, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ 8 మంది ఫోన్ పే, GPay ద్వారా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.
News February 20, 2026
ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.
News February 20, 2026
సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.


