News November 16, 2024

హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు

image

హీరో ధనుష్‌ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార మండిపడ్డారు. ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News December 9, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది.

News December 9, 2024

ఆయన కంటే మహానటుడు ఎవరున్నారు?: మంత్రి సత్యప్రసాద్

image

AP: జగన్ కంటే మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అరాచక పాలన సాగించి ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలు చెప్పి హామీలు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌‌ది అని విమర్శించారు. విద్యావ్యవస్థను దారిలో పెట్టి ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

News December 9, 2024

‘పుష్ప-2’: నాలుగు రోజుల్లో భారీగా కలెక్షన్లు

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో అత్యంత వేగంగా రూ.800 కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కాగా ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కాస్త తగ్గించారు.