News March 11, 2025

BREAKING: కొత్త రూ.100, రూ.200 నోట్లు

image

త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్‌తోనే కొత్త నోట్లు ఉంటాయని RBI పేర్కొంది. ఇవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది.

Similar News

News March 15, 2025

సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

image

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్‌లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?

News March 15, 2025

అమ్మానాన్నా.. ఆలోచించండి!

image

ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఎంతోమంది బలవన్మరణాలపాలవుతున్నారు. పిల్లలున్నవారు బిడ్డల్నీ చంపేస్తున్నారు. <<15717792>>హబ్సిగూడ<<>>, <<15765431>>కాకినాడ<<>> ఘటనలు అందర్నీ కలచివేస్తున్నాయి. పసిప్రాణాలను చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మీ కష్టాలకు మీ పసివాళ్లను కూడా బలిచేయడం ఎంతవరకూ న్యాయమో అమ్మానాన్నలు ఆలోచించాలని కోరుతున్నారు.
*సమస్య ఎలాంటిదైనా ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు.

News March 15, 2025

‘ప్రపంచంతో పోటీ పడటంలేదు.. నా పిల్లల్ని చంపేస్తున్నా’

image

AP: 1వ తరగతి, UKG చదివే ఇద్దరు పిల్లల్ని అత్యంత క్రూరంగా హతమార్చాడో తండ్రి. ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని, చంపేస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. కాకినాడ(D) సర్పవరం ONGCలో పనిచేస్తున్న చంద్రకిశోర్ భార్య, పిల్లలతో కలిసి నిన్న ఆఫీస్‌లో హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. తర్వాత పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు తాళ్లతో కట్టేసి, నీటి బకెట్లో తలలు ముంచి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

error: Content is protected !!