News March 2, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’పై అదిరిపోయే న్యూస్

image

సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డార్లింగ్ అంటే తనకు అభిమానమని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అద్భుతమైన సంగీతం అందిస్తానని చెప్పారు. సందీప్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయన్నారు. ఆయనతో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్‌ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.

News March 26, 2025

చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

image

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.

News March 26, 2025

ప్రభాస్ అలా చేస్తే ‘కన్నప్ప’ చేసేవాడిని కాదు: మంచు విష్ణు

image

కన్నప్ప సినిమా తీసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని హీరో మంచు విష్ణు చెప్పారు. అయితే శివలింగాన్ని తాకే సీన్లు చిత్రీకరించే సమయంలో నేలపై పడుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేస్తానని చెబితే తాను కన్నప్పను చేసేవాడిని కాదని పేర్కొన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నప్ప నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!