News March 24, 2025

BREAKING: మంత్రి వర్గ విస్తరణకు ఓకే!

image

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల భేటీ ముగిసింది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది రోజున ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.

Similar News

News April 22, 2025

నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌కు పాక్ అథ్లెట్!

image

ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో బెంగళూరులో JSW స్పోర్ట్స్ ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయబోతోంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ జావెలిన్ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ని కూడా ఆహ్వానించినట్లు నీరజ్ తెలిపారు. కోచ్‌తో మాట్లాడి కన్ఫార్మ్ చేస్తానని ఆయన చెప్పారని పేర్కొన్నారు.

News April 22, 2025

నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే

image

ప్రతి ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డే నిర్వహిస్తారు. 1970లో ఇదే రోజున USAలో దాదాపు 2 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పర్యావరణానికి జరుగుతున్న హానిపై నిరసన తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేను నిర్వహిస్తున్నారు. ‘భూమి మానవుడిది మాత్రమే కాదు. సకల జీవరాశులకు నిలయమని గుర్తుంచుకుందాం. అభివృద్ధి పేరుతో కాంక్రీట్ జంగిల్స్‌లా మార్చేసి జంతువుల గూడును చెరపొద్దు’ అని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.

News April 22, 2025

‘ఆస్కార్-2026’ డేట్ వచ్చేసింది.. కీలక మార్పులివే?

image

98వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను 2026లో మార్చి 15న నిర్వహించనున్నట్లు అకాడమీ తెలిపింది. ఎలిజిబిలిటీ గైడ్‌లైన్స్, నామినేషన్స్, ఓటింగ్‌లో నిబంధనలు సవరించినట్లు పేర్కొంది. ఇక నుంచి ఓట్ వేయాలంటే నామినేట్ అయిన సినిమాను అకాడమీ సభ్యులు కచ్చితంగా వీక్షించాలి. ఫైనల్ బ్యాలెట్‌లో నామినీలందరినీ చూపిస్తారు. AIని వాడిన మూవీస్‌నూ అనుమతించనున్నారు. అయితే హ్యూమన్ క్రియేటివిటీకే ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

error: Content is protected !!