News November 10, 2024

BREAKING: నటుడు ఢిల్లీ గణేశ్ మృతి

image

ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి చెందారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు.

Similar News

News December 6, 2024

ప్చ్.. రోహిత్ మళ్లీ ఫ్లాప్

image

టెస్టుల్లో రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆయన 3 పరుగులకే ఔటయ్యారు. గత 11 ఇన్నింగ్స్‌లలో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3 రన్స్ చేసి నిరాశపరిచారు. వీటిలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉండటం గమనార్హం. హిట్‌మ్యాన్ ఇకనైనా ఫామ్ అందుకోవాలని, లేదంటే టీమ్‌లో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News December 6, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగ్రా’ మూవీ

image

వాసన్ బాల డైరెక్షన్‌లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’ ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఓ అక్రమ కేసులో తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే పాత్రలో ఆలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

News December 6, 2024

గుండె గూటిలో ‘మినీ బ్రెయిన్’!

image

గుండెలో సొంత నరాల వ్యవస్థ ఉందని, దానినే మినీ బ్రెయిన్‌గా పిలుస్తారని కొలంబియా యూనివర్సిటీ కొత్త స్టడీ తెలిపింది. గుండె లయ నియంత్రణలో దీనిదే కీలక పాత్రని పేర్కొంది. ఇన్నాళ్లూ నరాల వ్యవస్థ ద్వారా మెదడు పంపించే సంకేతాలు పొంది పనిచేస్తుందన్న భావనను ఈ స్టడీ సవాల్ చేసింది. హృదయ కుడ్యాల్లోని సంక్లిష్ట న్యూరాన్స్ నెట్‌వర్క్‌ను గుర్తించింది. మనిషిని పోలిన గుండె కలిగిన జీబ్రాఫిష్‌‌ను ఈ టీమ్ స్టడీచేసింది.