News March 1, 2025
BREAKING: జైలులో పోసానికి అస్వస్థత

AP: అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు అతడిని జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఆయనకు కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 27, 2025
విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
News March 27, 2025
నెలన్నరలో 325 మంది మావోలు హతం: ఛత్తీస్‌గఢ్ సీఎం

ఛత్తీస్‌గఢ్‌లో నెలన్నరలో 325 మంది మావోయిస్టులు హతమైనట్లు ఆ రాష్ట్ర CM విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. మరో 2 వేల మంది అరెస్టు లేదా లొంగిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మావోయిస్టుల ప్రభావం ఉందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. బస్తర్ ప్రాంతం మినహా ఎక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా వారి జాడ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు CM తెలిపారు.
News March 27, 2025
రాష్ట్రంలో మరోసారి టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్?

TG: కామారెడ్డిలో పదో తరగతి <<15867946>>ప్రశ్నాపత్రం<<>> లీక్ కలకలం రేపింది. జుక్కల్ జడ్పీ పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి గణితం క్వశ్చన్ పేపర్‌లో పలు ప్రశ్నలు లీకైనట్లు తెలుస్తోంది. నీళ్లు సరఫరా చేసే వ్యక్తి ప్రశ్నలు రాసుకొచ్చి విద్యార్థికి జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రశ్నల లీక్ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.