News November 9, 2024
BREAKING: ప్రవచనకర్త చాగంటికి కీలక పదవి

AP: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల చేసింది. నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు-మహ్మద్ షరీఫ్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపుడి సత్తిబాబు, కళింగ ఛైర్మన్-రోణంకి కృష్ణం నాయుడు, కొప్పుల వెలమ- PVG కుమార్, తూర్పు కాపు-యశస్వి, రజక-సావిత్రి, వాల్మీకి-కప్పట్రాళ్ల సుశీలమ్మ.
*పూర్తి జాబితా కోసం <
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంపై CM చంద్రబాబు తీవ్ర విచారం

AP: కర్నూలులో బస్సు <<18087215>>ప్రమాదంపై <<>>దుబాయ్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబుకు అధికారులు సమాచారమిచ్చారు. ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. గాయాలతో బయటపడినవారిలో జస్మిత, అకీర, రమేశ్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్, నవీన్ కుమార్, అఖిల్, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News October 24, 2025
ఇవాళ లేదా రేపు టెట్ నోటిఫికేషన్!

ఏపీలో టెట్ నోటిఫికేషన్ ఇవాళ లేదా రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ టీచర్లు టెట్ పరీక్ష రాయనున్నారు. 2011కు ముందు టీచర్లుగా నియామకమైన అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్ రావాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
News October 24, 2025
శివాలయంలో లింగాన్ని ఎలా దర్శించుకోవాలి?

శివాలయంలో శివలింగాన్ని నేరుగా దర్శించకూడదని పండితులు చెబుతున్నారు. ముందుగా నందీశ్వరుడిని పూజించాలని సూచిస్తున్నారు. ‘నంది కొమ్ములపై చూపుడు, బొటన వేలును ఆనించి, ఆ మధ్యలో నుంచి గర్భాలయంలోని లింగాన్ని చూడాలి. దీన్ని శృంగ దర్శనం అంటారు. ఈ దర్శనం అయ్యాకే గర్భాలయం లోపలికి వెళ్లి శివ లింగాన్ని నేరుగా దర్శించుకోవాలి’ అని వివరిస్తున్నారు. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.


