News November 9, 2024
BREAKING: ప్రవచనకర్త చాగంటికి కీలక పదవి
AP: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల చేసింది. నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు-మహ్మద్ షరీఫ్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపుడి సత్తిబాబు, కళింగ ఛైర్మన్-రోణంకి కృష్ణం నాయుడు, కొప్పుల వెలమ- PVG కుమార్, తూర్పు కాపు-యశస్వి, రజక-సావిత్రి, వాల్మీకి-కప్పట్రాళ్ల సుశీలమ్మ.
*పూర్తి జాబితా కోసం <
Similar News
News December 7, 2024
వీకెండ్స్ మాత్రమే తాగినా ప్రమాదమే!
వారంలో ఒక రోజు మద్యం సేవించినా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డాక్టర్‌గా పేరొందిన సిరియాక్ ఫిలిప్ వారంలో ఒక రోజు మద్యం సేవించే 32 ఏళ్ల యువకుడి లివర్ దెబ్బతిన్న తీరును ప్రత్యేక్షంగా చూపించారు. ఆ యువకుడి భార్య ఇచ్చిన ఆరోగ్యవంతమైన లివర్‌తో దాన్ని పోలుస్తూ పంచుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఏ మోతాదులో తీసుకున్నా మద్యపానం హానికరమని చెబుతున్నారు. Share It.
News December 7, 2024
ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా: బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షోలో హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్‌గా చేస్తానని చెప్పారు. ఈ షోకు నవీన్ పొలిశెట్టి, శ్రీలీల అతిథులుగా రాగా వారితో సరదాగా సంభాషించారు. మరోవైపు తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్ చెప్పారు. తన ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే అని, తాను మాత్రం నటనను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
News December 7, 2024
BGTలో షమీ ఆడటం కష్టమే!
BGTలో భారత పేసర్ షమీ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతనికి NCA నుంచి క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణం. అతను టెస్టుల్లో బౌలింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నారా లేదా అనే దానిపై NCA టీమ్ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. అతడిని AUSకు పంపకపోవచ్చని, పంపినా చివరి టెస్టులో మాత్రమే ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం SMAT T20లో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. ఎల్లుండి చండీగఢ్‌తో బెంగాల్ ప్రీ QF ఆడనుంది.